సొమ్మొకడిది, సోకొకడిది అన్నట్లుంది సీఎం చంద్రబాబు వ్యవహారం అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పనిచేసేది ఒకరు, క్రెడిట్ పొందేది మరొకరు అని.. క్రెడిట్‌ని దొంగిలించగలగిన సమర్థుడు చంద్రబాబు మాత్రమే అని ఎద్దేవా చేశారు. కుప్పం, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకి ఏరోజు రాలేదని.. బాబు ఆడే నాటకాలు, మోసాలు జనాలకు బాగా తెలుసన్నారు. మాట ఇచ్చిన ప్రకారం వైఎస్ జగన్ కుప్పానికి నీళ్లు ఇచ్ఛారన్నారు. పోలవరం పనులు సరైన, సక్రమమైన…