ఈ రోజు చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై చెత్త వాగుడు వాగారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నువ్వు గజినీవి.. నీ చుట్టూ ఉన్నది చెత్త బ్యాచ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిట్‌చాట్ లో హరీష్ మాట్లాడారు. బనకచర్ల పై రేవంత్ రెడ్డి బాగోతం నగ్నంగా బయట పడిందన్నారు. ఆయన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.