Trudeau- Katy Perry: మాజీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో అమెరికన్ సింగర్ కేటీ పెర్రీ ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది. తాజాగా, పెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఇద్దరి మధ్య రిలేషన్‌ను ఉందని అధికారికంగా ప్రకటించింది. ట్రూడోతో కలిసి ఉన్న ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు.
ప్రముఖ పాప్ స్టార్ కేటీ పెర్రీ మరో తోడు వెతుక్కుంది. మాజీ ప్రధానితో కలిసి చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతోంది. ఎంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య కలుసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.