Home
Japan
Japan News
-
Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
Japanese Kitchen Cleaning Tips: ఉదయం లేవగానే వంటింట్లో పాత్రలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తే ఎవరికైనా చిరాకు రావడం సహజం. రాత్రి వంట పూర్తయ్యాక అలసటతో సింక్‌లో గిన్నెలు, కుక్కర్లు, ప్లేట్లు అలాగే వదిలేస్తుంటాం. దాంతో పొద్దున్నే లేచి టీ తాగే ఓపిక కూడా లేకుండా ఆ గిన్నెలు తోముకోవాల్సి వస్తుంది. పైగా కౌంటర్‌టాప్ అంతా నీళ్లతో నిండిపోతుంది. కానీ, రాత్రికి రాత్రే మీ వంటిల్లు అద్దంలా మెరిసిపోతూ, సింక్ పొడిగా ఉంటే ఎంత బాగుంటుందో కదా!… -
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
Asian Games 2026: ఆసియా క్రీడలు 2026 మహిళల క్రికెట్లో భారత జట్టు ఘన విజయంతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. నిషిన్‌లో శుక్రవారం జరిగిన నాలుగో క్వార్టర్ఫైనల్లో జపాన్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. మొదటి భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో జపాన్ కేవలం 57 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి జపాన్ బ్యాటర్లు పరుగులు చేయడానికి… -
Earthquake: జపాన్‌లో 7.1తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Earthquake: జపాన్ దక్షిణ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చింది. క్యూషులోని కుమమోటో ప్రిఫెక్చర్లో మంగళవారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం సముద్ర మట్టానికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా పలువరు గాయపడగా, ఒక భవనం కూలిపోయినట్లు ప్రధాని సనాయే తకైచి తెలిపారు. భూకంపం తర్వాత జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఒక మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు ప్రజల్ని… -
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించిన వివరాల ప్రకారం, కుమామోటో (Kumamoto) ప్రిఫెక్చర్లో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం అనంతరం గరిష్టంగా ఒక మీటర్ (3.28 అడుగులు) ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు… -
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి బాధ్యులు వారే.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణపై భారత్ సీరియస్..
Bullet Train: భారత్ తొలి ‘‘బుల్లెట్ ట్రైన్’’ ప్రాజెక్టుపై జపాన్ మాజీ న్యాయశాఖ మంత్రి హిడేకి మకిహారా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఆలస్యానికి పూర్తిగా బాధ్యత భారత్‌దే అని అన్నారు. భారత అధికారులతో జరిగిన అంతర్జాతీయ సమావేశాల్లో వారిలో నిర్లక్ష్యం పదే పదే కనిపించిందని, వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, వారి సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని మకిహారా అన్నారు. జపాన్ తరుపున చెప్పాలంటే, ఈ… -
Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ప్రపంచవ్యాప్తంగా వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదివారం ఉదయం జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, గత వారం రోజుల్లో ప్రపంచంలోని పలు దేశాల్లో మొత్తం 11 ప్రధాన భూకంపాలు నమోదయ్యాయి. దీంతో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జపాన్‌లో బలమైన ప్రకంపనలు జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:25 గంటలకు ఈశాన్య జపాన్‌లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సమీపంలో 6.1 తీవ్రతతో… -
Earthquake: భూకంపాల దెబ్బకు ఉలిక్కిపడ్డ రెండు దేశాలు.. జపాన్, వెనిజులాలో కలకలం
గత 24 గంటల్లో ప్రపంచంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ భూకంపాలు సంభవించాయి. గురువారం ఉత్తర జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం నమోదవగా, బుధవారం వెనిజులాలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్‌లో ఎటువంటి పెద్ద నష్టం జరగకపోయినా, వెనిజులా రాజధాని కారకాస్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం, గురువారం ఉత్తర జపాన్‌లోని ఇవాటే ప్రాంతానికి సమీపంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రంతో 6.9 తీవ్రత… -
Earthquake: చైనా, జపాన్‌లో భారీ భూకంపం.. కంపించిన భవనాలు
జపాన్, చైనాలను భారీ భూకంపం కుదిపేసింది. జపాన్‌లోని హోన్షు ద్వీపంలో 6.0 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. అలాగే చైనాలోని ఉత్తర క్వింగ్హై ప్రావిన్స్‌లో 6.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. -
Pakistan: జపాన్‌లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
Pakistan: పాకిస్తాన్ అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకోవడం అలవాటుగా మారింది. ఇస్లామిక్ ప్రపంచానికి పెద్దన్నగా కలరింగ్ ఇస్తున్న పాకిస్తాన్‌కు జపాన్ భారీ షాక్ ఇచ్చింది. జపాన్‌లోని కవాగోలో మసీదు వివాదంలో ఆ దేశ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మసీదు భవనాన్ని అవసరమైన అనుమతులు లేకుండా నిర్మించినట్లు జపాన్ అధికారులు చెప్పారు. ఈ మసీదును సైతామా ప్రిఫెక్చర్‌లోని కవాగోలో లో నిర్మించారు. పర్వత అటవీ భూమిగా గుర్తించిన భూమిలో ఈ మసీదు ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో అధికారులు ప్రత్యేక అనుమతి… -
Japan Roasts China: డ్రాగన్ దేశాన్ని నవ్వులపాలు చేసిన జపాన్.. అణు ఆయుధాలపై లైవ్‌లో మాస్ ర్యాగింగ్!
Japan Roasts China: సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు వేదికగా చైనా, జపాన్ దేశాల మధ్య దౌత్యపరమైన మాటల యుద్ధం ముదిరింది. ఆసియాలోనే అతిపెద్ద రక్షణ సదస్సు అయిన ‘షాంగ్రి – లా డైలాగ్’లో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి చైనా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేరుగా చైనా పేరు ఎత్తకుండానే, ఆ దేశ అహంకారాన్ని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టారు. ఈ సదస్సులో జరిగిన ఆసక్తికర పరిణామాలు, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన అంశాల…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!