Strawberries: స్ట్రాబెర్రీలు తిని 8 ఏళ్ల బాలుడు మరణించిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. స్కూల్‌లో సేకరించిన స్ట్రాబెర్రీలు తిని తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మరణించినట్లు తెలుస్తోంది. కెంటుకీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కెంటకీలోని మాడిసన్‌విల్లే నార్త్ హాప్‌కిన్స్ హైస్కూల్‌లో అతను ముందు రోజు సేకరించిన స్ట్రాబెర్రీలు తిన్నాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.