ప్రపంచ స్మార్ట్‌ఫోన్ రంగాన్ని పూర్తిగా మార్చేసిన బ్రాండ్ ‘యాపిల్’. 2007లో తొలి ఐఫోన్ విడుదలైనప్పటి నుంచి టెక్నాలజీ, డిజైన్, యూజర్ అనుభవంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి ఏడాది కొత్త ఫీచర్లు, శక్తివంతమైన ప్రాసెసర్లు, మెరుగైన కెమెరాలతో ఐఫోన్ సిరీస్‌లు ముందుకు సాగుతున్నాయి. 2007లో స్టీవ్ జాబ్స్ పరిచయం చేసిన తొలి ఐఫోన్ టచ్‌స్క్రీన్ ఫోన్లకు కొత్త దారులు తెరిచింది. ఆ తర్వాత iPhone 3G (2008), iPhone 3GS (2009) మోడళ్లతో ఇంటర్నెట్ వేగం,…