పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేశాడు కుమారుడు వెంకటేశ్వర్లు.. నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)ను కాలువలో పడేశాడు కుమారుడు.
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో అమానుష ఘటన చోటు చేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తున్న మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గత కొంతకాలంగా ఆ బాలికపై కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. అంతేకాకుండా.. అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. నిందితులు సంతోష్ నాయక్, అజయ్, సుభాష్ మైనర్లుగా గుర్తించారు. కాగా.. ఈ వీడియోలు వైరల్ కావడంతో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.