తెలుగు జాతి ఆస్తి.. దేశం ప్రపంచం నలుమూలల.. తెలిసే విధంగా మన పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.. చంద్రబాబు నాయుడు మీద దొంగ కేసులను, సంబంధం లేనటువంటి కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డికి మంత్రి కొట్టు సత్యనారాయణ క్లాస్ పీకారు. VVIP ఎంట్రీ గేట్ నుంచి దర్శనానికి పోలీసులు, రెవిన్యూ అధికారులు ఇష్టానుసారంగా తీసుకెళుతున్నారని మంత్రి దృష్టికి భక్తులు తీసుకొచ్చారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్ధానం పంచాంగంను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. సీఎం జగన్ ఎంతో సంతోషంగా అమ్మవారిని దర్శించుకున్నారు అని ఆయన పేర్కొన్నారు.
ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు కనిపించనున్నారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి స్వపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేసేశారు. దీంతో తొలి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు.
ఈ నెల 15 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్రారంభం కానున్న దసరా ఉత్సవాల ఏర్పాట్ల పై అధికారులు సమీక్షించారు. ఈ సమీక్షలో ఎండోమెంట్ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, వీఎంసీ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్, ఈఓ భ్రమరాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు.