ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే రెండు వన్డేలు ముగియగా. సిరీస్ 1-1తో సమంగా ఉంది. రాంచిలో జరిగిన తొలి వన్డేలో పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా.. రాయ్‌పుర్‌లో జరిగిన రెండో వన్డేలో అద్భుత విజయం సాధించింది. బుధవారం సఫారీలు 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి.. సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకున్నారు. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే శనివారం (డిసెంబర్ 6) వైజాగ్‌లో జరుగుతుంది. వన్డే మ్యాచ్ నేపథ్యంలో విశాఖ నగరంలో ఇప్పటికే…