టాటా మోటార్స్ కర్వ్ యొక్క ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) మోడల్‌ను లాంచ్ చేసింది. గత నెలలో కర్వ్ ఈవీ(Curvv EV) లాంచ్ అయిన సంగతి తెలిసిందే.. టాటా కర్వ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి వచ్చింది. కాగా.. కర్వ్ టాప్ మోడల్ రూ. 17.69 లక్షలు ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). 2024 అక్టోబర్ 31 వరకు బుకింగ్‌లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది.