అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో 11 మంది మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. శని, ఆదివారాల్లో అమెరికాలోని వాషింగ్టన్, ఫ్లోరిడా, హ్యూస్టన్ సిటిలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలో ఓ సైకో జరిపిన కాల్పుల్లో నలుగురు, హ్యూస్టన్ లో నలుగురు, వాషింగ్టన్‌లో ముగ్గురు మృతి చెందారు. విచ్చలవిడిగా గన్ కల్చర్ పెరిగిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. గత కొంతకాలంగా అమెరికాలో గన్‌కలచ్చర్ పెరిగిపోతున్నది. కరోనా కాలంలో ఈ గన్ కల్చర్ మరింతగా పెరిగింది.…