వేసవి కాలం రాగానే భానుడి భగభగలకు ఇళ్లు నిప్పుల కొలిమిలా మారుతుంటాయి. ఏసీలు, కూలర్లు ఉన్నా కరెంట్ బిల్లుల భయంతో చాలామంది వాటిని వాడటానికి వెనకాడుతుంటారు. అయితే, కొన్ని సహజమైన పద్ధతులు పాటించడం ద్వారా ఏసీలు లేకపోయినా మీ ఇంటిని చల్లని ప్రదేశంగా మార్చుకోవచ్చు. పగటిపూట సూర్యరశ్మి నేరుగా గోడలపై, కిటికీలపై పడటం వల్ల గదులన్నీ వేడెక్కుతాయి. కింద పేర్కొన్న చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఇంటి ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించుకోవచ్చు. పగటిపూట కిటికీలు,…