(జనవరి 24న సి.ఉమామహేశ్వరరావు పుట్టినరోజు)తెలుగు చిత్రసీమలో అభిరుచి గలిగి, ఏ నాడూ రాజీపడని దర్శకులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో సి.ఉమామహేశ్వరరావు చోటు సంపాదించారు. ‘అంకురం’ ఉమామహేశ్వరరావుగా జనం మదిలో స్థానం దక్కించుకున్నారాయన. సదా విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారాయన. బహుశా, అందువల్లేనేమో సి.ఉమామహేశ్వరరావు కమర్షియల్ సక్సెస్ ను అంతగా సొంతం చేసుకోలేక పోయారు అనిపిస్తుంది. తెలుగునేలపై కృష్ణమ్మ ఒడిలో 1952 జనవరి 24న కన్ను తెరచిన సి.ఉమామహేశ్వరరావు ఆ తల్లి గలగలలు వింటూ సాహిత్యంపై…