Sheikh Hasina: గతేడాది హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అయితే, ఈ అల్లర్లలో పలువురు మరణాలకు కారణమయ్యారని, మానవత్వానికి వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడ్డారని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో, హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్, భారత్‌ను కోరుతోంది.