Manchu Mohan Babu: కలక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నేడు తన 71 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. దీంతో అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం మోహన్ బాబుకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
నటప్రపూర్ణ డాక్టర్ యమ్.మోహన్ బాబు తనదైన అభినయంతో వందలాది చిత్రాల్లో ఆకట్టుకున్నారు. ఆయన నటనావారసత్వాన్ని పునికి పుచ్చుకొని తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్, కూతురు మంచు లక్ష్మి సైతం సాగుతున్నారు. ఇప్పటికే తనయులతో కలసి నటించి అలరించిన మోహన్ బాబు, తొలిసారి కూతురు లక్ష్మితో కలసి ‘అగ్నినక్షత్రం’లో నటిస్తున్నారు. ఆ సినిమా త్వరలోనే జనం ముందుకు రానుంది. ఇక గుణశేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’లో దుర్వాసునిగానూ తనదైన అభినయంతో అలరించనున్నారు మోహన్ బాబు. ఏప్రిల్ 14న ‘శాకుంతలం’…
(మార్చి 19న నటనిర్మాత మోహన్ బాబు పుట్టినరోజు)విలక్షణమైన అభినయానికి మారుపేరుగా నిలిచారు డాక్టర్ ఎమ్.మోహన్ బాబు. ఆయన కెరీర్ గ్రాఫ్ లో ఉవ్వెత్తున ఎగసి, ఉస్సూరుమని కూలిన కెరటాలు కనిపిస్తాయి. పలు ఎత్తులు, పల్లాలు చూశారాయన. అసలు తెలుగునాట అలాంటి ఆటుపోట్లు మరో స్టార్ కు ఎదురు కాలేదని చెప్పవచ్చు. అన్నిటినీ చిరునవ్వుతో గెలుచుకుంటూ ముందుకు సాగారు మోహన్ బాబు. 500పై చిలుకు చిత్రాల్లో నటించి, ఈ నాటికీ నటించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారాయన. ఆయన అభినయంలోని…