Home
Gyanesh Kumar
Gyanesh Kumar News
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
Supreme Court: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహణతో పాటు భారత ఎన్నికల సంఘం (EC) పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంటూ, సోమవారం రాత్రి ఈసీ సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌కు సమాధానం (రీజాయిండర్) ఇచ్చేందుకు పిటిషనర్ రాకేష్ కుమార్ సింగ్‌కు 10 రోజుల సమయం కేటాయించింది. పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్… -
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
Congress Delhi Rally: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న ఢిల్లీ వేదికగా నిర్వహించబోయే ‘ఇండియా’ (INDIA) కూటమి ర్యాలీకి దాదాపు 10 లక్షల మంది హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం హర్యానా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంజయ్ దత్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రావు నరేంద్ర సింగ్ పీటీఐ (PTI) వార్తా సంస్థకు వెల్లడించారు. దేశ ప్రజాస్వామ్యానికి… -
Anti-SIR Protest: నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టు షాక్..
Anti-SIR Protest: ఆల్ ఇండియా స్టూడెంట్ యూనియన్(AISA) అధ్యక్షురాలు నేహా బోరాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తాకింది. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న నేపథ్యంలో తనకు జారీ చేసిన రూ. 10000 పీస్ బాండ్ నోటీసుల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆందోళన నేపథ్యంలో న్యూఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(SEM) కోర్టు అక్టోబర్ 17న ఈ నోటీసు జారీ చేసింది. శాంతిభద్రతల్ని కాపాడేందుకు ఒక పూచికత్తుతో పాటు రూ. 10,000 వ్యక్తిగత… -
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
CJP:కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన నమోదైన రెండు కేసుల్లో వారి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు సమన్లు జారీ చేసింది. సీజేపీ సభ్యుడు అజింక్యా షిండేకు కూడా సమన్లు జారీ చేుసినట్ల ఢిల్లీ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు దాస్, రాంకాలు రాజౌరీ గార్డెన్‌లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారణకు హాజరు… -
Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
Marco Rubio: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)జ్ఞానేష్ కుమార్‌కి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనపై భారత ప్రభుత్వం అణగదొక్కుతోందని ఐక్యరాజ్యసమితి(UN) నిపుణులు చేసిన వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. వారు ‘‘ఐక్యరాజ్య సమితి నిపుణులు’’ కాదని, విరుద్ధ అభిప్రాయాలు ఉన్న వ్యక్తులని కొట్టిపారేశారు. ప్రజా నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు. భారత్‌లో ఇటీవల నిరసనల్ని నియంత్రణపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని 20 మందికి పైగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల నిపుణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో… -
CJP: ‘‘విద్యార్థుల నిరసనలు అల్లర్లుగా మారాయి’’.. ఫ్రాన్స్ ఘటనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల కస్టడీకి సంబంధించిన కేసును బుధవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. సీజేపీ తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ హైకోర్టు ఫ్రాన్స్‌లో అల్లర్లను ప్రస్తావించింది. మొదట విద్యార్థి ఆందోళనగా ప్రారంభమైన నిరసనలు అగ్నిప్రమాదాలు, దోపిడీలకు దారి తీశాయని కోర్టు పేర్కొంది. నిరసనలకు అనుమతి తీసుకోవడం కేవలం ఆందోళనకారుల్ని నియంత్రించడానికి మాత్రమే కాకుండా, ఇతరులు చేరి పరిస్థితిని చెడగొట్టకుండా చూడటానికి అవసరమని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. జస్టిస్… -
Rahul Gandhi: ‘‘హాలిడే ట్రిప్‌కు రాహుల్ గాంధీ’’.. అబద్ధాలు చెప్పి అలసిపోయాడని బీజేపీ సెటైర్లు..
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లారు. ఇప్పుడు ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదంగా మారింది. ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అవకతవకలు జరిగాయని భారీ స్థాయిలో ఉద్యమం చేసిన రాహుల్ గాంధీ హఠాత్తుగా వియత్నాం పర్యటనకు వెళ్లడంపై బీజేపీ విమర్శలు చేసింది. బీజేపీ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ..బిజినెస్ క్లాస్‌లో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆ… -
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
Lal Hit Janata Party: నీట్ పేపర్ లీక్‌పై జంతర్ మంతర్ నిరసనల తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకువచ్చిన ఈ సీజేపీ ఇప్పుడు సీఈసీని టార్గెట్ చేస్తోంది. ఇదిలా, సీజేపీకి వ్యతిరేకంగా ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ఏర్పాటైంది. ఆదివారం ఢిల్లీలోని మాలవ్య స్మృతి భవన్లో ఈ గ్రూపు తొలి సభ్యత్వ… -
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
Ravi Kishan: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) జెన్-జీ ఉద్యమాలు చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ కీలక వ్యాఖ్యు చేశారు. ఈ దేశానికి యువతే భవిష్యత్తు అని, జెన్-జీ భారతదేశ ఆత్మ అని అన్నారు. యువత దేశభక్తి కలిగిన వారని, అనేక విషయాలపై అవగాహనతో ఉన్నారని, భవిష్యత్తులో దేశాన్ని నడిపించే బాధ్యతలు చేపడుతారని పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన ‘ఖిడ్కియాన్ థియేటర్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పాల్గొన్న రవికిషన్… -
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
Congress: ప్రభుత్వ మార్పు, రెజిమ్ చేంజ్ అనేది ప్రతిపక్షాల ఉద్దేశమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ స్పందించింది. ఆ పార్టీ నేత పవన్ ఖేరా మాట్లాడుతూ.. ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని అన్నారు. ఎన్నికల సంఘం పనితీరు, SIR ప్రక్రియ, ఎన్డీయే కూటమి ఐక్యతపై ఆయన ప్రశ్నల్ని లేవనెత్తారు. ‘‘ఓట్ చోర్ గద్దీ ఛోడ్’’ పేరుతో తాము ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రస్తుత ప్రభుత్వాన్ని ఓడించి పాలనను మార్చాలనే ఉద్దేశాన్ని…
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్‌లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!