దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ శకం మొదలైంది. జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించేందుకు అధినేత కేసీఆర్ హస్తినలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు. రాజశ్యామల యాగం, చండీయాగం, యాగ పూర్ణాహుతిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. వేదపండితుల ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాలకు నూతన కార్యాలయంలో గులాబీ జెండా ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి.. తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. భారత రాష్ట్ర సమితి కార్యాలయ ప్రారంభోత్సవానికి మాజీ…
ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్, తిక్రీ సరిహద్దులలోని నిరసన ప్రదేశాల నుండి బారికేడ్లను తొలగించిన తరువాత, రైతులను అక్కడి నుండి పంపిచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వెలుపల దీపావళి చేసుకుంటారని రైతు సంఘాల నాయకుడు గుర్నామ్ సింగ్ చదుని ఆదివారం హెచ్చరించారు. గురు, శుక్రవారాల్లో ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో రైతుల నిరసన స్థలాల నుండి బారికేడ్లు, ముళ్ల వైర్లను తొలగించారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న…