ప్రకృతి, మానవత్వం చాలా పవిత్రమైన సంబంధాన్ని పంచుకుంటున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 30 ఏళ్ల ప్రాజెక్ట్ ఎలిఫెంట్‌ను పురస్కరించుకుని శుక్రవారం అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో 'గజ్ ఉత్సవ్ 2023'ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రకృతిని గౌరవించే సంస్కృతి మన దేశానికి గుర్తింపు అని రాష్ట్రపతి అన్నారు.