తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల మంచు లక్ష్మి , సీనియర్ జర్నలిస్ట్ మధ్య సంభవించిన వివాదం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి నిర్మించిన ‘దక్ష’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే, ఆ ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ ‘మీరు 50 ఏళ్లకు దగ్గరవుతున్నారు. 12 ఏళ్ల కూతురు ఉన్నా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అంటూ వ్యక్తిగతంగా, అవమానకరంగా ప్రశ్నలు…