రోజూ ఉదయం టీ తాగడం అందరికీ అలవాటే. అయితే.. పోషకాలు అధికంగా ఉండే మెంతి టీని తాగినట్లైతో మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతి టీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో.. జీర్ణక్రియకు సహాయం చేయడం.. రక్తంలో చక్కెర, బరువు నిర్వహణలో సహాయపడుతుంది. మెంతి టీని మెంతి మొక్కలో ఉండే గింజల నుండి తయారు చేస్తారు.