ఆగస్టు 15, జనవరి 26వ తేదీ వచ్చిందంటే చాలు మనలో చాలామందికి దేశభక్తి పొంగిపొరలుతుంది. సోషల్ మీడియాలో దేశభక్తి వెల్లువలా మెసేజ్ లు, స్టాటస్ ల రూపంలో కనిపిస్తుంది. కానీ నిత్యం తమలోని దేశభక్తిని చాటుకుంటూ తమ విలక్షణతను అందరికీ తెలియచేస్తున్నారు కొందరు దేశభక్తులు. ఇలాంటి అరుదైన ఘటన నిత్యం ఒక జిల్లాలో కనిపిస్తుంది. అది కూడా తెలంగాణలోనే వుండడం గమనార్హం. తెలంగాణకు మకుటాయమానంగా మారిన ఆ జిల్లా వేరే ఏదీ కాదు. పోరాటాల ఖిల్లా.. నల్లగొండ…