ఉక్రెయిన్‌పై బాంబు దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంబించారని, భారత్ పై ద్వితీయ సుంకాలను విధించడం కూడా ఇందులో భాగమని అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తెలిపారు. జేడీ వాన్స్ మాట్లాడుతూ.. రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవడం ఈ చర్యల లక్ష్యం అని అన్నారు. అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అవసరమైతే మరిన్ని సుంకాలు విధించేందుకు కూడా వెనకాడబోనని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. భారత్ మాత్రం రష్యాతో బంధం కొనసాగుతుందని, టారిఫ్‌ల భారాన్ని మోసేందుకు సిద్ధమని ప్రకటించింది. అయితే ట్రంప్ ఎందుకిలా రెచ్చిపోతున్నారు? ఆయన రాజకీయ, వ్యూహాత్మక లక్ష్యాలు ఏంటి? భారత్-రష్యా సంబంధాలను దెబ్బ కొట్టేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారా..? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. భారత్‌పై ట్రంప్ సుంకాలు..!…