Monsoon : తెలంగాణలో వర్షాకాలం త్వరితగతిన ప్రారంభమవుతోంది. సాధారణంగా జూన్ రెండో వారంలో రాష్ట్రంలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon), ఈసారి అంచనా వేసిన సమయానికంటే ముందుగానే రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఈసారి నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతూ, రెండు రోజుల వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద విస్తరించే అవకాశముంది. ఈ పరిణామం రైతులకు ఉత్సాహాన్నివ్వడమే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి లభ్యత, నీటి వనరుల నిల్వ, పౌర…