తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పాత ఊరిలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. భార్యపై అనుమానంతో తలపై డంపుల్స్ తో కొట్టి హతమార్చాడు. నిందితుడు తుపాకుల సాయిగా గుర్తించారు. కాగా.. మృతురాలు తుపాకుల అరుణకుమారి. అయితే.. వీరి స్వస్థలం బొబ్బిలి. పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం అనపర్తి వచ్చి బతుకుతున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లల సంతానం కూడా ఉంది. కాగా.. తన తల్లి మరణంతో పిల్లలు తీవ్రంగా రోధిస్తున్నారు.