బసవతారం కేన్సర్ ఆస్పత్రి లో ఇవాళ మరో మరో మణిపూస చేరిందని… నటుడు, ఆ ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో డిజిటల్ రేడియోగ్రఫీ సదుపాయాన్ని శుక్రవారం బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేడియాలజీ విభాగంలో ఇప్పటికే 3డీ డిజిటల్ మమ్మోగ్రామ్ ఉందని, కొత్తగా డిజిటల్ రేడియోగ్రఫీని కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ఎంతో వేగవంతమైనదని తెలిపారు. సాధారణంగా ఫిల్మ్…