రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే చేసి నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సంచలన ప్రకటన చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి, వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్(అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని తెలిపారు.. ఈ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం ఎంతో శ్రమించి, ప్రవేశ పెట్టి, అమలు చేస్తున్న ధరణి పోర్టల్ నూటికి నూరు పాళ్లు విజయవంతమైందని..…