(సెప్టెంబర్ 20న ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి) తెరపై ధర్మవరపు సుబ్రహ్మణ్యం కనిపించగానే ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. తాను నటించిన ప్రతి చిత్రంలోనూ ఏదో ఓ వైవిధ్యం ప్రదర్శిస్తూ ఆయన నవ్వులు పూయించారు. ఆయన నవ్వుల నటనకు నంది అవార్డులూ లభించాయి. బుల్లితెరపైనా తన సంతకం చేస్తూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ‘తోకలేని పిట్ట’తో దర్శకునిగానూ నవ్వులు పూయించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘానికి అధ్యక్షునిగానూ వ్యవహరించారు. ‘శోభన్ బాబు రింగు’ అంటూ నుదుటన జుత్తును రింగులా…