TSPSC Paper: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలి కోసం డీఏవో పరీక్ష పేపర్‌ను రూ.6 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) రాత పరీక్షలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తన వివరాలు తప్పుగా నమోదు చేశానని.. ఓ అభ్యర్థి ఏకంగా ఓఎంఆర్ షీటునే మింగేశాడు. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో జరిగింది.