వెస్టిండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో 14 వేలకు పైగా పరుగులు, మూడు వందల వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో భాగంగా ఈరోజు ఉదయం బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పొలార్డ్ ఈ ఫీట్ అందుకున్నాడు. మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఫీట్ సాధించాడు.…