సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏం చేసినా సంచలంగా మారుతుంది.. సంచలన వ్యాఖ్యలే కాదు.. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన కార్యక్రమాలు వైరల్‌గా మారిపోతుంటాయి.. తాజాగా… విశాఖలోని శారదా పీఠంలో ప్రత్యక్షమయ్యారు నారాయణ.. అక్కడ స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.. అదేంటి కరుడుగట్టిన కమ్యూనిస్టు నారాయణ.. శారదాపీఠం వెళ్లడమేంటి..? అక్కడ ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి..? అనే అనుమానం వెంటనే కలగొచ్చు.. విషయం ఏంటంటే.. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.. జీవీఎంసీలో ఆయన సీపీఐ అభ్యర్థి తరపున…