మెదక్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ కి ఏకగ్రీవం కావొద్దనే కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టాము అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అభ్యర్థిని పెట్టాము. మాకు 230 ఓట్లు ఉన్నాయి. .మేము గెలిచే అవకాశం లేదు. కానీ మా ఓట్లు మేము వేసుకోవాలని అనుకున్నాం. మేము అభ్యర్థి ని ప్రకటించగానే హరీష్ రావు ఉలిక్కి పడ్డారు. క్యాంప్ లు పెట్టాల్సింది మేము… కానీ టీఆర్ఎస్ వాళ్ళు భయంతో క్యాంప్ లు…
స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, డాక్టర్ సంజీవ్ రెడ్డి మండల, టౌన్, బ్లాక్ ప్రెసిడెంట్స్ ,ఎంపీటీసీ, కౌన్సిలర్ లు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ… స్థానిక నేతలకు మంత్రి హరీష్ రావు అపాయింట్ మెంట్ ఇచ్చేవాడే కాదు. కానీ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో పెట్టగానే…
తెలంగాణ కాంగ్రెస్‌లో వారిని దారిలోకి తేవడం ఎవరి వల్లా కావడం లేదా? సీనియర్ నాయకుడు చేపట్టిన రాయబారం ఎంత వరకు వచ్చింది? రావాలని ఉన్నా.. పార్టీ అగ్రనాయకులు ఆయన్ని లైట్ తీసుకున్నారా..? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కోమటిరెడ్డి సోదరులతో వీహెచ్ రాయబారం..! కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ వాళ్లను వదులుకోలేదు.. అలాగని వాళ్ల గుమ్మం వరకు వెళ్లి…
రైతు అమరవీరుల పోరాటం తోనే మోడీ దిగొచ్చి చట్టాలను రద్దు చేశారు. మోడీ, కేసీఆర్ లు ఇద్దరు కార్పొరేట్ ల కాళ్లు మొక్కుతున్నారు అని కాంగ్రెస్ ఏమ్మెల్యే సీతక్క అన్నారు. రైతులపై సీఎం, పీఎం లకి నిజమైన ప్రేమ ఉంటే వెంటనే పూర్తిగా ధాన్యం కొనాలి అని సీతక్క పేర్కొన్నారు. ఇక మధు యాష్కీ మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. రైతులు, కాంగ్రెస్ పోరాటం చేయడం వల్లనే నల్ల చట్టాలు రద్దు అయ్యాయి.…
ఏపీ, తెలంగాణ సీఎంలు ఇద్దరూ ఒకటే అని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి.ఏపీ, తెలంగాణ నాయకుల మధ్య విచిత్రమైన చర్చ నడుస్తోందన్నారు. రాష్ట్రం విడిపోక ముందు ఒకలా, రాష్ట్రం విడిపోయిన తర్వాత మరోలా చర్చ జరుగుతోంది. అనేక అంశాలతో తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఉండేవి. రాష్ట్ర విభజనకు సంబంధించి మేధావులు, కవులు, కళాకారుల డిమాండ్లు వినిపించారు. కేసీఆర్ కూడా ఉద్యమానికి…
రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌లోనే ధర్నాకు దిగారు. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల జోధ్‌పూర్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కున్వర్ మేనల్లుడు పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే మేనల్లుడిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మీనా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘ఈరోజుల్లో పిల్లలందరూ తాగుతున్నారు. అయినా తాగితే తప్పేంటి?…
కార్పొరేట్ శక్తులను పెంచే పనిలో పడింది మోడీ ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. కుల వృత్తులు కూడా కార్పొరేట్ శక్తులు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న.. తెలంగాణ, ఏపీ లో ఆందోళనలు లేకపోవడం దురదృష్టకరం. రైతులు బయటకు రాకపోవడం కి పోలీసు కేసులు కారణం అని అన్నారు. జగన్, కెసిఆర్ పోలీసుల తో కేసులు పెట్టిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై కనీసం జగన్, కెసిఆర్ మాట్లాడటం లేదు. రైతుల కోసం కొట్లడేది ఒక…
ఇక్కడ భూమి ఒక్కరిది, రైతు బంధు ఒక్కరిది. భూ సమస్యల పరిష్కారం ఏమో కాని, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నరు. భూమి ఉన్నోళ్లకు రైతు బంధు వస్తలేదు. అర్హులకు పథకాలు అందడం లేదు అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క. ధరణి అనేదే సమస్యల పుట్ట అని చెప్పిన సీతక్క భూస్వాములకు ధరణిలో సమస్యలు లేవు. కొద్దీ మొత్తం భూమి ఉన్న రైతులకే ఈ సమస్యలు. వాళ్ళకి కావాల్సినవి సీక్రెట్ గా చేస్తరు. రైతులకు ఎంలేదు. దళిత బంధు…
చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… వరదల సమయంలో కరోనా రావడం తో చౌటుప్పల్ కి రాలేక పోయా అన్నారు. గత ఏడాది కూడా వర్షాలకు చెరువులు నిండి అలుగు వరద తో జాతీయ రహదారిపై వరద రావడం జరిగింది,దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని తెలిపాను. ప్రజా సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ల లంటే ముఖ్యమంత్రి సమయం కూడా ఇవ్వడు. మునుగోడు నియోజక వర్గం సమస్య ల పై అసెంబ్లీ…
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే క్లారిటీకి వచ్చినట్టే వస్తారు.. ఇంతలోనే కొత్త స్టేట్మెంట్ ఇస్తారు. ఎదుటివారికే కన్ఫ్యూజన్. ఇప్పుడు మరింత స్పష్టత కోసం ఫోకస్ పెట్టారట. కలిసి నడుస్తారో లేక.. కాదూ కూడదనే అంటారో కానీ.. ఢిల్లీ భేటీలతో పార్టీలో చర్చగా మారారు. ఢిల్లీ డెవలప్మెంట్తో చర్చల్లోకి వచ్చిన రాజగోపాల్‌రెడ్డి! రాజకీయ వ్యూహాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ఎత్తుగడ ఎవరికీ అంతు చిక్కదు. వాళ్ల వరకు క్లారిటీతో ఉంటారో లేదో.. కేడర్ మాత్రం కన్ఫ్యూజ్లో ఉంటుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి…