‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రా శుక్లా కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఉనికి’. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి దీనిని నిర్మించారు. తొలుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమాను దర్శక నిర్మాతలు విడుదల చేయాలని భావించారు. అయితే సంక్రాంతి బరి నుండి పెద్ద చిత్రాలు ‘ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్’ తప్పుకోవడంతో ఆ సీజన్ ను ఉపయోగించుకోవాలనే ఆశతో సినిమా విడుదల తేదీని 15వ తేదీకి…