Baby Dead Body on Scooty: పండంటి కూతుర్ని కాపాడుకోవాలన్న ఆ దంపతులు ఆశ తీరలేదు. కంటిపాప కన్నుమూసిందని దుఃఖంలో ఉంటే , ఆసుపత్రి సిబ్బంది దుర్మార్గంగా ప్రవర్తించారు. పసిగుడ్డు మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ అడిగితే మానవత్వం లేకుండా తిరస్కరించారు. మరోదారి లేక ద్విచక్ర వాహనంపై బిడ్డ శవాన్ని మధ్యలో కూర్చో బెట్టుకుని, ఒకట్రెండు కాదు ఏకంగా 120 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ అమానవీయ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుందామని…