టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సింధూ.. కోచ్‌ను మార్చడంపై తాజాగా మరోసారి స్పష్టతనిచ్చింది. ఏడాదిన్నరగా పార్క్ శిక్షణ ఇస్తున్నాడనీ… భవిష్యత్తులోనూ అతని ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగిస్తాననీ తేల్చి చెప్పింది. గోపీచంద్ అకాడమీని వీడి గచ్చిబౌలి స్టేడియంలో సాధన చేయడంలో వివాదమేమీ లేదన్న సింధూ.. అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులో ఉన్న స్టేడియం వసతుల్ని ఉపయోగించుకున్నానని చెప్పింది. ఫిబ్రవరి నుంచి అక్కడే సాధన చేస్తున్నాననీ… ఆ స్టేడియంలో ఆడటం టోక్యోలో ఎంతగానో ఉపయోగపడిందని తెలిపింది సింధు. టోక్యోలో కాంస్యం గెలిచాక…