ఇవాళ రాజస్థాన్ కొత్త మంత్రి వర్గం కొలువుదీరనుంది. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సీఎం మినహా మంత్రివర్గం అంతా రాజీనామా చేసింది. శాసనసభలో 200 మంది సభ్యుల సంఖ్య ప్రకారం.. కేబినెట్‌లో గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ గతంలో ఇచ్చిన హామీ మేరకు సీనియర్ నేత సచిన్ పైలట్ వర్గానికి మంత్రి వర్గ విస్తరణలో ప్రధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పైలట్ టీంకు మెజార్టీ…
కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సమయంలో మంత్రివర్గంలోని సీనియర్లకు షాక్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ… కొత్తవారికి అవకాశం ఇస్తూనే.. కొందరు పాతవారికి ప్రమోషన్లు ఇచ్చిన ప్రధాని.. ఏకంగా 12 మంది కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించడం సంచలనంగా మారింది.. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా తమ పదవులు కోల్పోయారు.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్, సంతోష్ గాంగ్వర్,…
తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ దక్కింది.. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన ఆయనకు నరేంద్ర మోడీ 2 సర్కార్‌లో సహాయమంత్రి పదవి దక్కగా.. తాజా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆయన కేబినెట్ మినిస్టర్ అయ్యారు.. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనుండగా.. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భనన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.. మెరుగైన పనితీరు కనబర్చిన పలువురు…
ప్రధాని నరేంద్ర మోడీ కొత్త కేబినెట్ ఇవాళ సాయంత్రం కొలువుదీరనుంది.. కేబినెట్ విస్తరణలో 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనుండగా.. వీరిలో కేబినెట్ మంత్రులుగా ప్రమోట్ అయిన ఏడుగురు సహాయ మంత్రులు కూడా ఉన్నారు.. ఇదే సమయంలో ఐదుగురు కేంద్ర మంత్రులను తొలగిస్తున్నారు ప్రధాని మోడీ… ఈ విస్తరణ తర్వాత కేబినెట్‌లో 12 మంది ఎస్సీ, 8 మంది ఎస్టీ వర్గానికి చెందిన మంత్రులు ఉండనుండగా.. 27 మంది ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగులు) మంత్రులు…