Off The Record: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆయన మాటలు తూటాల్లా పేలుతుంటాయి. నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం, నచ్చకుంటే కడిగేయడం ఆయన నైజం. అలాంటి సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె.నారాయణకు ఇప్పుడు సొంత పార్టీ తీసుకున్న ఓ నిర్ణయం నచ్చనట్లుంది. అందుకే టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట. నారాయణకు తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినా… తెలంగాణ ఉద్యమానికి పార్టీని ఒప్పించిన నేత. అయితే ప్రస్తుతం తెలంగాణలో…