Indore: ఇండోర్ నగరంలో ఇటీవల ప్రభుత్వం మొదలుపెట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఊహించని నిజాన్ని బయటకు తీసుకొచ్చింది. వీధుల్లో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి, వారికి జీవనోపాధి మార్గాలు చూపించాలనే ఉద్దేశంతో “భిక్షాటన రహిత ఇండోర్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు. కానీ ఈ కార్యక్రమంలో ఒక వ్యక్తి కథ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సరాఫా బజార్ ప్రాంతంలో మంగీలాల్ అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా భిక్ష అడుగుతూ కనిపించేవాడు. ఆయనకు శారీరక వైకల్యం ఉండటంతో…