ఏడాది కాలంలో స్వదేశంలో టెస్టుల్లో భారత్ రెండు వైట్‌వాష్‌లను ఎదుర్కొంది. భారత గడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశాయి. 2024 నవంబర్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా నిలిచింది. 2025 ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో వైట్ వాష్‌కు గురవడం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. ఈ రెండు వైట్‌వాష్‌లు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేప్పట్టాకే జరిగాయి.…
భారత జట్టు కొత్త హెడ్ కోచ్ నియామకానికి సమయం ఆసన్నమైంది. ముందునుంచి ఊహించినట్టుగానే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మంగళవారం (జూన్ 18) బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూలో గౌతీ పాల్గొన్నాడు. జూమ్ కాల్ ద్వారా జరిగిన ఇంటర్వ్యూలో సీఏసీ ఛైర్మన్ అశోక్ మల్హోత్రాతో పాటు సభ్యులు జతిన్ పరాంజపె, సులక్షణ నాయక్‌లు గంభీర్‌తో మాట్లాడారు. ఇంటర్వ్యూలో భాగంగా నిన్న ఓ రౌండ్ ముగియగా..…