బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నిమిషానికి 500 లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన అత్యాధునిక ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు నందమూరి బాలకృష్ణ. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ… కోవిడ్ మహమ్మారి ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్నారు. ఆక్సిజన్ ను విమానాలలో ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించి దేశ వ్యాప్తంగా పంపిణీ చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఆక్సిజన్ సరఫరాలో కూడా…
బసవతారం కేన్సర్ ఆస్పత్రి లో ఇవాళ మరో మరో మణిపూస చేరిందని… నటుడు, ఆ ఆస్పత్రి చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో డిజిటల్ రేడియోగ్రఫీ సదుపాయాన్ని శుక్రవారం బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేడియాలజీ విభాగంలో ఇప్పటికే 3డీ డిజిటల్ మమ్మోగ్రామ్ ఉందని, కొత్తగా డిజిటల్ రేడియోగ్రఫీని కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. ఈ డిజిటల్ రేడియోగ్రఫీ ఎంతో వేగవంతమైనదని తెలిపారు. సాధారణంగా ఫిల్మ్…