Muhammad Yunus: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్‌కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. 2024లో బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, భారత్ పారిపోయి వచ్చింది. ఈ పరిణామాల తర్వాత యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులయ్యారు. అయితే, ఆయన నియామకం తర్వాత మైనారిటీలు , ముఖ్యంగా హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు.