G20 Meeting: బనారస్‌లో సోమవారం జరుగుతున్న జి20 అభివృద్ధి మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ శతాబ్దాలుగా కాశీ.. విజ్ఞానానికి, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు కేంద్రంగా ఉందని అన్నారు.