బద్వేలు ఉప ఎన్నిక ప్రచారం జోరు అందుకున్నది. నిన్నటితో నామినేషన్ల పర్వం ముగియడంతో పోటీలో ఉన్న పార్టీలు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. బద్వేలు ఉప ఎన్నికలో జనసేన పోటీ చేయాల్సి ఉన్నా, గత సంప్రదాయాలను గౌరవిస్తూ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నది. అయితే, జనసేన తప్పుకోవడంతో బీజేపీ పోటీకి సిద్ధమైంది. బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన పార్టీ బీజేపీకి ప్రచారం చేస్తుందా లేదా అనే అంశంపై నిన్నటి వరకు సందేహం ఉన్నది. జనసేన పార్టీ నేత నాదెండ్ల…
బద్వేల్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 30 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో అట్లూరు మండలంలోని చిన్నమరాజుపల్లె గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదని, తాము బద్వేల్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామ పొలిమేర్లలో బ్యానర్‌ను కట్టారు. ఏ నాయకుడు తమ గ్రామంలోకి రావొద్దని, గ్రామానికి రోడ్డు…
ఈనెల 30 వ తేదీన కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార వైసీపీ తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్ధిని ప్రకటించారు. అయితే, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అవకాశం వచ్చింది. అభ్యర్థిని ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయమని ఒత్తిడి వచ్చిందని, చనిపోయిన…
బద్వేల్ ఉప ఎన్నికలు అక్టోబర్ 30 వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో విజయం తమదే అని టీడీపీ ధీమాను వ్యక్తం చేసింది. దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో అభివృద్ది చేశారని టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎం జగన్ బద్వేల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు…
కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నికను అక్టోబర్ 30 వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. కాగా, రేపు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 30 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి…