ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ మూవీ రెండు భాగాలుగా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాల క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. బాహుబలి సినిమాల రీరిలీజ్ చేస్తే బాగుంటుందని పలు సందర్భాలలో ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు చెప్పుకొచ్చారు. అయితే భారత సినీ చరిత్రలో ఓ అద్భుతం, ఓ మైలురాయిగా నిలిచిన చిత్రం ‘బాహుబలి’ నేటికి పదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సోషల్ మీడియాలో భావోద్వేగ భరితంగా…