యాపారం.. ఇది అలాంటిలాంటి యాపారం కాదు. అయోధ్య రామయ్యనే అంగడి సరకు చేసేసిన ఫక్తు బిజినెస్. విశాఖ బీచ్ రోడ్‌లో సముద్రుడి సాక్షిగా... భక్తుల మనోభావాలతో ఆడుకున్న పరమ వికృత వ్యాపారం. ఇక్కడ పైకి చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంది. అబ్బో... వీళ్ళెవరో మహానుభావులు..... అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ బాల రాముడినే మన ముందుకు తీసుకువచ్చారని అనిపిస్తుంది.