భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఆరో అనుబంధ ఛార్జిషీట్ పరిశీలనపై అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది.