NASA: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్ట్రాయిడ్ మిషన్ సక్సెస్ అయింది. దాదాపుగా 7 ఏళ్ల తరువాత బెన్నూ అనే గ్రహశకలంపై నుంచి నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. ఆదివారం అమెరికా ఊటా రాష్ట్రంలో ఎడారిలో నాసా క్యాప్సూల్ దిగింది. నాసా 2016లో ‘ఒరిసిస్ రెక్స్’ అనే స్పేస్ ప్రోబ్ ను అంతరిక్షంలోకి పంపింది. సుమారు 3 ఏళ్లు ప్రయాణించి బెన్నూ అనే గ్రహశకలాన్ని చేరింది.