టాలీవుడ్‌లోనూ ‘స్టాలిన్’, ‘స్పైడర్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన విషయాన్ని అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఏఆర్ మురుగదాస్, ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం ఒక సరికొత్త కథాంశాన్ని ఎంచుకున్నట్టు వెల్లడించారు. ఇటీవల శివకార్తికేయన్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘మదరాసీ’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, ఇప్పుడు తన డ్రీమ్…