ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణశాఖ అధికారులు.. నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రస్తుతం శ్రీలంక తీరానికి దగ్గరగా కేంద్రీకృతమైందని.. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా వాయువ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించిందని వెల్లడించిన ఐఎండీ.. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఓ…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి లక్షకు పైగా ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,09,446 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 40,847 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 882.20 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 200.1971 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం…
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో…
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను కలవరానికి గురిచేశాయి.. అయితే, ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, రుతుపవన ద్రోణి దక్షిణాది వైపుగా కొనసాగనుంది. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదిలే అవకాశమున్నందున నేటి నుంచి 17వ తేదీ వరకు ఉత్తర కోస్తాలో వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.…
ఏపీలో రాబోయే రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణశాఖ. ఈరోజు, రేపు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులుతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక రాయలసీమలో కూడా మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అనంతపురం, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణశాఖ. ఇది ఇలా ఉండగా.. నిన్న రాత్రి హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో కుండపోత వాన కురిసింది.…
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. ఇటు విజయవాడ సిటీతో పాటు.. అటు వైజాగ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది.. ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది అమరావతి వాతావరణ కేంద్ర… ఏపీలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన…
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచిచింది… ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోటర్ల ఎత్తుల మధ్య ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. దీని ప్రభావము వలన 28 జూలై 2021 తేదీన ఉత్తర బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం…