ఆనందయ్య తయారు చేస్తున్న మందు వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. కరోనా చికిత్సకు ఆనందయ్య మందు పని చేస్తుందని తిరుపతి ఎస్వీ ఆయుర్వేద యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ భాస్కరరావు స్పష్టం చేశారు. ఆనందయ్యది నాటు మందు కాదు… నాటి మందు అని..ఆనందయ్య మందును ప్రోత్సహించాలని సలహా ఇచ్చారు. కరోనాకు చేస్తున్న చికిత్సలో చాలా సార్లు మార్పులు చేశారని..కంట్లో వేస్తున్న మందు వలన కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కంటిలో వేస్తున్న మందు వలన పల్స్ పెరుగుతుందని…సైన్స్…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. కృష్ణపట్నం పేరు మారుమ్రోగుతోంది. కరోనాకు ఉచితంగా మందుపంపిణీ చేస్తుండడంతో.. ఇప్పుడు వేలాది మంది అటు పరుగులు తీస్తున్నారు. ఆనంద్ ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు.. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. అయితే ఈ మందుపై ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య నిపుణులు పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఆయుర్వేద వైద్యుడు…