అజిత్ పవార్ తనపై చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ శనివారం బదులిచ్చారు. సోదరుడి కుమారుడైన అజిత్ పవార్‌పై విరుచుకుపడ్డారు. 'రిటైర్' అవ్వాలని అజిత్ పవార్ చేసిన సూచన మేరకు.. తాను అలసిపోనని, రిటైర్మెంట్ తీసుకోనని, తనలో ఇంకా ఫైర్ అలాగే మిగిలి ఉందని అన్నారు.